
నేషనల్ క్రష్ రష్మిక మందన విజయ్ దేవరకొండతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. విజయ్ దేవరకొండతో తాను నటించిన ఓ చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది.

విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన తొలి చిత్రం గీత గోవిందం, ‘డియర్ కామ్రేడ్’. ఈ రెండు మువీల్లో గీత గోవిందం మువీతో ఇద్దరికీ మంచి గుర్తింపుదక్కింది. ఈ సినిమాతో ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, రష్మిక ఆ తర్వాత డియర్ కామ్రెడ్‌లో జంటగా నటించారు.

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీ 2019లో విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మువీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఐతే విజయ్, రష్మిక పెయిర్ మాత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై జులై 26 నాటికి సరిగ్గా నాలుగేళ్లు అవుతోంది.

ఈ సందర్భంగా నటి రష్మిక ‘డియర్ కామ్రేడ్’ మువీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ భరత్‌తో దిగిన ఓ ఫొటోని తన పోస్టులో షేర్ చేసింది. ‘డియర్ కామ్రేడ్’ మువీ నాకెప్పటికీ ప్రత్యేకమే. ఈ మువీ విడుదలై నేటికి నాలుగేళ్లు. థ్యాంక్యూ విజయ్, భరత్ అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

కాగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. ఐతే రష్మిక, విజయ్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కి వెళుతూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరూ డేట్‌లో ఉన్నట్లు నెటిజన్లు కన్ఫామ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ బ్రేకప్ అయ్యారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక తాజా పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.