
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మంధాన. సినిమా విశేషాలతో పాటు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేసుకుంటుంది.

నా వ్యక్తిగత జీవితంలో జరిగేది ప్రతిసారి కెమెరా పెట్టి చూపించలేను. ప్రతి మెసేజ్ సోషల్ మీడియా లో పెట్టలేం. నా పర్సనల్ లైఫ్ గురించి జనాలు ఏం మాట్లాడుకున్న నాకు అవసరం లేదు. నా వృత్తికి సంబంధించి ఏం చెప్తున్నారో దాన్ని తీసుకుంటాను. అందుకు తగినట్టు పనిచేస్తాను.వృత్తి పరంగా నేను ఏం చేస్తున్నానో ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత" అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

తాజాగా ఒక మ్యాగజైన్ కోసం నిర్వహించిన ఫొటోషూట్‌లో పాల్గొంది రష్మిక. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రానున్న పుష్ప 2 సినిమాలో పాటు విజయ్ వారసుడు సినిమాల్లో నటిస్తుంది రష్మిక. ఇక బాలీవుడ్‌లో మిషన్ మజ్ఞు రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Rashmika Mandanna