
రష్మిక మందన్నా.. 2016లో కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగశౌర్య సరసన ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది ఈ అమ్మడు.

ఆ తర్వాత టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం రష్మిక బన్నీ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది.

అంతేకాకుండా.. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ.. అక్కడ కూడా ఫుల్ బిజీగా ఉంటోంది రష్కిక.

అయితే రష్మికకు జంతువులంటే అమితమైన ప్రేమ. పావురం, పిల్లి, కుక్క పిల్లలను పెంచుకుంటునే ఉంటుంది.

వాటితో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

అంతేకాదు.. వాటి రక్షణకు కావాల్సిన అంశాలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది.