
అందాల భామ రాశి ఖన్నా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ భామ. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

చూడచక్కని రూపం, ఆకట్టుకునే నటన ఉన్న రాశి టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రాశి ఖన్నా. అంతే కాదు ఈ అమ్మడు మంచి సింగర్ కూడా.

సందీప్ కిషన్ హీరోగా నటించిన జోరు సినిమాలో ఓ పాటను కూడా ఆలపించింది రాశి ఖన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. మీడియం రేంజ్ హీరోల సరసన సినిమాలు చేస్తోన్న రాశి . బడా హీరోల సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రాశి ఖన్నా. అలాగే సినిమాల్లోనూ తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించి మెప్పించింది.

తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసింది. మరోసారి తన గ్లామర్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.