గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పెద్దగా కనిపించిన రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంటోంది. సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే శనివారం (నవంబర్ 30) రాశీ ఖన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఆమెకు బర్త్ డే విషెస్ వెల్లు వెత్తాయి.
ఇదిలా ఉంటే రాశీ ఖన్నా తన బర్త్ డే ను పేరెంట్స్ తో కలిసి పవిత్ర కాశీలో జరుపుకుంది. సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేసింది.
ఇక కాశీలో హోమం కూడా జరిపించింది రాశీ ఖన్నా. ఇందుకు సంబందించిన వీడియోలను, ఫోటోలను షేర్ చెయ్యగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు కాశీలోని స్కూల్ పిల్లలతో కూడా తన బర్త్ డే జరుపుకుంది. అక్కడి పిల్లలతో కేక్ కట్ చేసి వారితో సరదాగా గడిపింది.