తెలుగులో అందం, అభినయంతో తనదైన ముద్ర వేసింది రాశీ ఖన్నా. యంగ్ హీరోల సరసన నటిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో మెరిసింది ఈ వ్యయారి.
తాజాగా సోషల్ మీడియాలో జిమ్ ఫోటోస్ షేర్ చేసి షాకిచ్చింది. తన ఫిట్నెస్ గురూ కుల్ దీప్ తో కలిసి జిమ్ లో కష్టపడుతున్న ఫోటోస్ షేర్ చేసింది. పర్పెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని హైలెట్ చేస్తూ ఫోటోషూట్ తోనే కుర్రహీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది.
తెలుగులో వరుస సినిమాలతో అలరించిన రాశీ ఖన్నా.. ఇప్పుడు హిందీలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇటీవల రాజ్ అండ్ డీకే తెరెకక్కించిన ఫర్జీ సినిమాలో కనిపించింది. అలాగే ఇటీవల ది సబర్మతి రిపోర్ట్ మూవీతో అలరించింది.
హిందీలో ది సబర్మతి రిపోర్ట్, సర్దార్, యోధా వంటి చిత్రాలు రాశీకి మంచి గుర్తింపు తెచ్చాయి. అలాగే ఇటీవల అరణ్మై 4 సినిమాతో తమిళంలోనూ సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే హిందీలో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని సినిమాలో నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. గ్రీన్ కలర్ సారీలో బ్యూటీఫుల్ ఫోటోస్ పంచుకుంది.