Priyanka Arul Mohan: క్రేజీ ఛాన్స్ అందుకున్న ఓజీ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్..
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ్ బ్యూటీ ప్రియంకా అరుళ్ మోహన్. ఆ తర్వాత శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రియాంక మోహన్. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులుగా వేగంగా జరుగుతుంది.