
క్రేజీ బ్యూటీ ప్రియా వారియర్ దేవ కన్య లుక్ లోకి మారిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏంజెల్‌గా తయారైన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది.

2019 లో ప్రియా ప్రకాష్ వారియర్ 'ఒరు అదార్ లవ్' సినిమాలోనటించింది. ఈ సినిమా ప్రియాకుమంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది.

కన్నడ చిత్రం ‘విష్ణుప్రియ’లో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. నిర్మాత కె మంజు తనయుడు శ్రేయాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రియా ప్రకాష్ వారియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త ఫోటోలు షేర్ చేసింది.