
అయితే ఈ వెర్షన్‌నే తనదైన స్టైల్‌లో ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు బ్యూటీఫుల్ పూజా హెగ్డే. నచ్చినంత సేపు పడుకోవడం, ఉన్న చోట గెంతులేయడం, సినిమాటోగ్రాఫర్ చెయిర్‌ని కబ్జా చేయడం..

కెరీర్‌లో సక్సెస్ కొత్తగాదు, గ్యాప్ కొత్తగాదు, ఫెయిల్యూర్స్ కొత్త కాదు. అలాగని డీలా పడితే ఎలా? రేపు బావుంటుందనే నమ్మకంతో మన పని మనం చేసుకుపోవడమే నాకు తెలిసిన పని అని అంటున్నారు మేడమ్ పూజ.

ఎంత పెద్ద హీరోయిన్ కెరీర్‌కైనా ఏదో ఓ టైమ్‌లో ఎక్స్‌పైరీ డేట్ తప్పదు. తాజాగా పూజా విషయంలోనూ ఇదే జరుగుతుంది. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ఫోటోషూట్స్‌తో అలా కాలం గడిపేస్తున్నారు ఈ బ్యూటీ.

టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్‌తోనే జోడీ కట్టారు పూజా. వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్ట్స్ లిస్టులో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని ఆశగా చూస్తున్నారు.

ఒకటేంటీ? పూజా అల్లరిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. చోటా చోటా సరదాలు లేకుంటే లైఫ్ ఏం బావుంటుందంటూ కొంటెగా కన్నుగీటుతున్నారు మిస్ హెగ్డే.

ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. అందుకే తెలుగు నుంచి ఆఫర్స్ వస్తే హ్యాపీ.. రాకపోతే ఇంకా హ్యాపీ అన్నట్లున్నారు ఈ బ్యూటీ. ఖాళీ దొరికితే ఎంచక్కా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. చాలా కాలం వెయిటింగ్ తర్వాత ఈ మధ్యే నాగ చైతన్య సినిమాలో అవకాశం దక్కింది ఈ భామకు.

విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. గతంలోనే ఒక లైలా కోసంలో కలిసి నటించారు చైతూ, పూజా. దాదాపు పదేళ్ళ తర్వాత మరోసారి జోడీ కడుతున్నారు ఈ బ్యూటీ. మరి ఈ చిత్రం పూజాకు ఏ మేర హెల్ప్ అవుతుందో చూడాలి.