
బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఎవరైనా అక్కడి కల్చర్‌కు అలవాటు పడాల్సిందే. అలా కాదు.. మేం ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం అంటే అక్కడ కుదరదు. నయనతార కూడా దీనికి మినహాయింపేమీ కాదు. జవాన్ తర్వాత ఈమెకు కూడా బాలీవుడ్ గాలి సోకింది.

దాంతో ఎప్పుడూ లేనిది ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు నయన్. మరి ఈమెలో వచ్చిన మార్పుకు కారణమేంటి..? సాధారణంగా మూవీ ప్రమోషన్స్‌కు మాత్రమే కాదు.. ఫోటోషూట్స్‌కు కూడా దూరంగానే ఉంటారు నయనతార. ఎంత పెద్ద హీరోతో నటించినా కూడా ప్రమోషన్స్ వైపు చూడరు.

ఎవరివరకో ఎందుకు.. జవాన్ ప్రమోషన్స్‌లోనూ నయన్ కనిపించలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లినా.. నయన్ పద్దతులు మార్చుకోలేదని అర్థమైంది. కానీ తనకు అలవాటు లేని ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేసారిప్పుడు.

తాజాగా నయనతార ఫోటోషూట్ వైరల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత హీట్ పెంచేసారు నయన్. అసలు ఈ మధ్య సినిమాల్లో కూడా గ్లామర్ షోకు దూరంగా ఉన్నారు నయన్. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పరిమితమైపోయారు.

జవాన్‌లోనూ పెద్దగా గ్లామర్ షో చేయలేదు నయన్. కానీ ఇప్పుడు ఓ మ్యాగజైన్ కోసం నయన్ 2.0 కనిపించారు. ఉన్నట్లుండి నయనతార ఇలా రెచ్చిపోవడం వెనక రీజన్ బాలీవుడ్ అని అర్థమవుతుంది. జవాన్ తర్వాత అక్కడ్నుంచి ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

అంతేకాదు.. సినిమాకు 15 కోట్లకు పైనే ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ సినిమా నుంచి పిలుపొచ్చింది నయనతారకు. బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలంటే ఈ మాత్రం హీట్ పెంచక తప్పదని ఫిక్సైపోయారు ఈ భామ.