Rajeev Rayala |
May 03, 2024 | 9:06 PM
నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.
ఇక డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నభా నటేష్ , ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నభా నటేష్ తన గ్లామర్ తో హైలైట్ గా నిలిచింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కానీ అంతగా హిట్ అందుకోలేకపోయింది. రవితేజ నటించిన డిస్కో రాజా సినిమా చేసిన అది హిట్ అవ్వలేకపోయింది.
ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ చిన్నది. అయితే నభా నటేష్ కు యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే తాజాగా నభ నటేష్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో నభా నటేష్ చేతిపై ఇంకా గాయం మరక కనిపిస్తుంది. దాంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.