
సీతారామం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీగా ఆకట్టుకుంది మృణాల్.

ఆతర్వాత ఈ అమ్మడికి క్రేజ్ పెరిగిపోయింది. సీతారామంలాంటి క్లాసిక్ తర్వాత హాయ్ నాన్న అనే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. నాని హీరోగా నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మృణాల్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది.

ఆతర్వాత ఫ్యామిలి స్టార్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మంచి మార్కులు అయితే పడ్డాయి. రీసెంట్ గా కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది మృణాల్.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్డేట్స్ కూడా ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. అభిమానులను ఫిదా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.

తాను ఎక్కువగా చూసే సినిమా ఇదే అంటూ హాయ్ నాన్న సినిమా చూస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోకు నేను ఎక్కువగా చూసే సినిమా ఇదే.. నా ఫెవర్ట్ మూవీ అంటూ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.