
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండా గణేష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది మృణాళిని రవి.

చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయంతో అలరించింది ఈ చిన్నది. గద్దల కొండా గణేష్ సినిమా తర్వాత తమిళ్ లో బిజీగా మారిపోయింది.

తమిళ్ ఇండస్ట్రీలో ఈ చిన్నది వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అక్కడా విశాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

తెలుగులోనూ బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కితే ఇక్కడ కూడా మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది మృణాళిని రవి.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా ఈ వయ్యారి తన బ్యూటీఫుల్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.