- Telugu News Photo Gallery Cinema photos Actress Megha Akash Says Her Dream to Act With Pawan Kalyan telugu cinema news
Megha Akash: పవన్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోన్న మేఘ.. ముద్దుగుమ్మ డ్రీమ్ అదేనట..
లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ సోయగం మేఘా ఆకాష్. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ చిత్రంలో నటించినప్పటికీ క్లిక్ కాలేకపోయింది.
Updated on: Apr 07, 2023 | 9:17 PM

లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ సోయగం మేఘా ఆకాష్. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ చిత్రంలో నటించినప్పటికీ క్లిక్ కాలేకపోయింది.

ఆ తర్వాత రాజ రాజ చోర, డియర్ మేఘ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవి అమ్మడికి కలిసి రాలేదు. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ కావాలని లాంచ్ అయినా.. ఇప్పటికీ క్లిక్ కాలేకపోయింది.

కానీ ఈఏడాది ఈ ముద్దుగుమ్మకు అదృష్టం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు చేతిలో ఐదారు సినిమాలున్నాయి. ఐదారేళ్ల కెరీర్లో ఎప్పుడూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయలేదు మేఘ.

ప్రస్తుతం రవితేజ సరసన రావణాసుర చిత్రంలో నటించింది మేఘ ఆకాష్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోన్న మేఘ.. తన మనసులోని మాటలు బయటపెట్టింది.

నటిగా తన ప్రయాణం పట్ల.. తనకు దక్కిన గుర్తింపు పట్ల పూర్తి సంతోషంగా ఉన్నట్లు తెలిపిందే. అతిగా ఆశించడం తనకు నచ్చదని తెలిపింది.

కానీ తనకు పవన్ కళ్యాణ్ తో ఒకేక సినిమా అయినా చేయాలన్నది తన డ్రీమ్ అని తెలిపింది. అదెప్పుడో నెరవేరుతుందో చూడాలి. నేను ఇష్టపడే వాతావరణంలో నచ్చిన పాత్రలతో ప్రయాణాన్ని ఆస్వాదిస్తానంటూ చెప్పుకొచ్చింది.

సెట్లో ఉన్నప్పుడు మానిటర్ లో చూడనని. బాగా చేసానా? లేదా? అని దర్శకుడిని అడిగి వదిలేస్తానని. ఆయన మాట ఫైనల్ కాబట్టి. అక్కడ అంతకు మించి నటులు చేయాల్సింది ఏమీ ఉండదని అన్నారు.

పవన్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోన్న మేఘ.. ముద్దుగుమ్మ డ్రీమ్ అదేనట..

పవన్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోన్న మేఘ.. ముద్దుగుమ్మ డ్రీమ్ అదేనట..




