
మాధురీ దీక్షిత్‌కు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ. మూడు సంవత్సరాల వయసు నుంచే ఆమె నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది.

1984లో 'అబోద్' చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాధురీ. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కానీ.. మాధురీకి మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తర్వాత మాధురీ 'అవారా బాప్', 'స్వాతి', 'మానవ్ కిల్లింగ్', 'నార్త్ సౌత్' సహా పలు చిత్రాల్లో నటించిది. ఇందులో ఏ సినిమా కూడా విజయం సాధించలేకపోయాయి. కానీ తర్వాత విడుదలైన 'తేజాబ్' సినిమా మాధురీ కెరీర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పింది.

అలాగే 1988 విడుదలైన తేజాబ్ సినిమాలో మాధురీ మోహిన్ పాత్రలో ఆకట్టుకుంది. ఇందులోని ఏక్, దో, తీన్ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మాధురీ రామ్ లఖన్, ప్రేమ్ ప్రతిజ్ఞ, త్రిదేవ్ సినిమాల్లో నటించింది.

ఇక ఆ తర్వాత మాధురీ సంజయ్ దత్ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో సాజన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబోలో ఖత్రోన్ కే ఖిలాడి, టెర్రైన్, కనూన్ అప్నా అప్నా, థానేదార్, ఖల్నాయక్, సాహిబన్ వంటి సినిమాలు వచ్చాయి.

ఇక అదే సమయంలో వారిద్దరూ రిలేషన్లో ఉన్నారని బీటౌన్ లో వార్తలు వచ్చాయి. 1993లో జరిగిన బాంబు పేలుళ్ల అనంతరం సంజయ్ దత్ కు మాధురీ దూరంగా ఉందని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఈ విషయంపై వీరిద్దరు స్పంధించలేదు.

1993లోనే ఓ మూవీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాధురీ సంజయ్ విషయం పై స్పంధించింది. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. తనతో సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.

1999 అక్టోబర్ 17న మాధురీ యూఎస్ సర్జన్ శ్రీరామ్ మాధవ్ నేనే ను వివాహం చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని మాధురి అన్నయ్య ఇంటిలో ఈ వేడుక జరిగింది. మాధురికి ఇద్దరు కుమారులు.. ఆరిన్ నేనే, ర్యాన్ నేనే ఉన్నారు.

మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు.