
టాలీవుడ్ హీరోయిన్ లయ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందీ అందాల తార.

అలాగే బిగ్ బాస్ ఫేమ్ నటుడు శివాజీతో కలిసి మరో సినిమాలోనూ నటిస్తోంది లయ. ఇటీవలే ఈ కొత్త సినిమా షూటింగ్ పట్టాలెక్కింది. దీంతో పాటు టీవీ షోల్లోనూ మెరుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మధ్యన నాగార్జున సాగర్ డ్యామ్, పోలవరం ప్రాజెక్టులను సందర్శించింది లయ. తన ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్లి సరదాగా గడిపింది.

ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా అరకు వ్యాలీలోని బొర్రా గుహలను సందర్శించుకుందీ అందాల తార.

అనంతరం వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన లయ 'అడ్వెంచెరస్ అండ్ థ్రిల్లింగ్' అంటూ బొర్రా గుహల విశేషాలను పంచుకుంది.