Janhvi Kapoor: సినిమా సైన్ చెయ్యడానికి ఎదో ఒక కారణం ఉండాలిగా అంటున్న జాన్వీ కపూర్.
ఫలానా సినిమాకు ఎందుకు సంతకం చేశామని ఎప్పుడైనా అనిపించిందనుకోండి.. చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉండాలి. ఆ రీజన్ కేవలం మెటీరియల్ రూపంలో కనిపించకూడదు. మనసుకు సంతృప్తినిచ్చేలా ఉండాలి అని అంటున్నారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఏ నటికైనా కమర్షియల్ సినిమాలకు పని చేయడం సులువు. మిగిలిన సబ్జెక్టులతో కంపేర్ చేస్తే, మెంటల్ స్ట్రెస్ కాస్త తక్కువగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. నేమ్, ఫేమ్‌కీ కొదవ ఉండదు.