
యాపిల్ పిల్ల హన్సిక మోత్వాని త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన హన్సిక తన అందం, అభినయంతో మంచి గుర్తింపు పొందింది. ఐతే గత కొంతకాలంగా హన్సిక వివాహంపై వార్తలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

పెళ్లి వార్తలపై వస్తున్న కథనాలపై హన్సిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్ కతురియాతో తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్టు చేసింది.

హన్సిక, సోహైల్ చిన్నతనం మంచి ఫ్రెండ్స్. పలు వ్యాపారల్లో వీరిద్దరూ కలిసి పెట్టుబడులు సైతం పెట్టారు. క్రమక్రమంగా వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇక సోహైల్-హన్సిక గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఐతే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ తమ రిలేషన్‌షిప్ గురించి అధికారికంగా ప్రకటించారు.

హన్సికకు కాబోయే భర్త సోహెల్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.

వీరి వివాహ ముహూర్తం కూడా ఖరారైంది. డిసెంబర్ 4న జైపూర్‌లో సోహైల్-హన్సిక వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హన్సిక 'మైనేమ్ ఈజ్ శ్రుతి' మువీలో నటిస్తోంది.