Rajeev Rayala |
Dec 05, 2021 | 8:43 PM
ఈషా రెబ్బ.. ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గా కాకపోయినా.. సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ ఈషా రెబ్బా.
'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది.
నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రాలేదు.
ఇటీవలే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఈ చిన్నది.. ఈ సిరీస్ లో ఈషా రెబ్బ ఆయనకు మంచి మార్కులు పడ్డాయి.
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.