
అందాల భామ బాంధవి శ్రీధర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది 2022లో విడుదలైన "మసూద" అనే సినిమాలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో ఆమె దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించి, తన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా బాంధవి శ్రీధర్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దాంతో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. బాంధవి శ్రీధర్ హీరోయిన్‌గా అడుగుపెట్టడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది. ఆమె "మిస్టర్ పర్‌ఫెక్ట్", "రభస", "మొగుడు", "రామయ్య వస్తావయ్య", "మజ్ను" వంటి తెలుగు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. .

కాగా "మసూద" సినిమాతోనే ఆమెకు హీరోయిన్‌గా పెద్ద బ్రేక్ లభించింది. అంతేకాకుండా, బాంధవి శ్రీధర్ అందాల పోటీల్లో కూడా విజయం సాధించింది. ఆమె 2019లో "మిస్ ఇండియా రన్నరప్"గా నిలిచింది, అలాగే "మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019" మరియు "మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019" టైటిల్స్‌ను గెలుచుకుంది.

ప్రస్తుతం బాంధవి శ్రీధర్ తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని మంచి అవకాశాల కోసం చూస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు అభిమానులను కవ్విస్తున్నాయి. తన గ్లామరస్ లుక్స్ తో నెటిజన్స్ ను కట్టిపడేస్తుంది బాంధవి. ఈ చిన్నదాని ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది.

తాజాగా ఈ చిన్నది కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేస్తుంది. బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్ ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ బ్యూటీ ఆకట్టుకునే సినిమాతో వస్తుందని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.