
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైయింది అవికా గోర్. ఈ సీరియల్ డబ్బింగ్ సీరియలే అయినా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు.

ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది అవికా. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలా జంపాల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

తొలి సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత మరోసారి రాజ్ తరుణ్ కు జోడీగా నటించింది అవికా గోర్.

ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా చూపిస్తా మామ కూడా హిట్ అయ్యింది. ఆతర్వాత హీరోయిన్ గా బిజీగా మారిపోయింది అవికా. తెలుగుతో పాటు, హిందీలోనూ సినిమాలు చేసింది.

ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి మరీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలతో కేక పెట్టిస్తుంది.