చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవీకా గోర్. అదే సమయంలో పలు సివిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో కథానాయికగా మారింది. ఈమూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంది. కానీ అనుకున్నంత బ్రేక్ మాత్రం రాలేదు. యంగ్ హీరోల సరసన అనేక చిత్రాల్లో నటించింది.

అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానితో అవికా పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

గత కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఓ రియాల్టీ షోలో జంటగా పాల్గొన్న వీరు తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2020 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకున్నారు.

గత కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఓ రియాల్టీ షోలో జంటగా పాల్గొన్న వీరు తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2020 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకున్నారు.