- Telugu News Photo Gallery Cinema photos Actress Anupama Parameswaran Birthday Special Story telugu cinema news
Anupama Parameswaran: ఉంగరాల ముంగురులున్న చిన్నది.. అందంతోనే కట్టిపడేస్తోంది.. అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు నేడు..
చంద్రబింబం వంటి మోము.. కలువ కన్నులు.. ఉంగరాల ముంగురులు.. చూడగానే కట్టిపడేసే అందం ఆమె సొంతం. చిరునవ్వుతోనే కోట్లాది మంది ప్రేక్షకుల హృదయలను కొల్లగొట్టే మయురం. తెలుగువారి మదిని దోచిన ఆ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
Updated on: Feb 18, 2023 | 1:51 PM

చంద్రబింబం వంటి మోము.. కలువ కన్నులు.. ఉంగరాల ముంగురులు.. చూడగానే కట్టిపడేసే అందం ఆమె సొంతం. చిరునవ్వుతోనే కోట్లాది మంది ప్రేక్షకుల హృదయలను కొల్లగొట్టే మయురం. తెలుగువారి మదిని దోచిన ఆ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళ చిత్రాల్లో అలరించింది.

గతేడాది కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ రెండు చిత్రాల్లో నిఖిల్, అనుపమ జంటగా నటించి మెప్పించారు. ఈ సూపర్ హిట్ జోడికి ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం అనుపమ మరీచిక అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇప్పుడు ఆమె తమిళంలో ఓ సినిమాతోపాటు.. మలయాళంలోనూ ఓ చిత్రం చేస్తుంది.

1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇన్ జలకుడలో జన్మించింది. కొట్టాయమ్ లోని సీఎమ్ఎస్ కాలేజీలో కమ్యునికేటివ్ ఇంగ్లీష్ చదువుతూ ఉండగానే సినిమాల్లో అడుగు పెట్టింది.

మలయాళ హీరో నివిన్ పౌలీ హీరోగా రూపొందించిన ప్రేమమ్ సినిమాతో తొలిసారి తెరపై తళుక్కుమంది ఈ చిన్నది. ఆ తర్వాత ప్రేమమ్ చిత్రంలో ఎంపికైంది. అంతకంటే ముందే అఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.

ప్రస్తుతం అనుపమ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తోన్న డీజే టిల్లు 2 చిత్రంలో నటిస్తుంది.




