Rajeev Rayala |
Jun 16, 2021 | 2:05 PM
అవ్వడానికి తెలుగమ్మాయి అయినా తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంజలి. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను కూడా పలకరించింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు .
ఆతర్వాత ఆమె నటించిన జర్నీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత అంజలి తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూవస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత అంజలి పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి కవ్వించింది. సూర్య నటించిన సింగం 3, అలాగే అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది అంజలి
రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది అంజలి. ఈ సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
నేడు అంజలి పుట్టిన రోజు సందర్భంగా ఈ అమ్మడికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, పలువురు సినిమా తారలు విషెస్ తెలుపుతున్నారు.