
ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ ఆదా శర్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే తన జీవితంలో ఎదురైన పరిస్థితులను బయటపెట్టింది.

మనం సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తామో.. అలాగే మనతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించాలని చూస్తే అంతే వేగంగా కనిపెట్టాలి.. ఆ సమయంలో మనం ఏం చేయాలనేదానిపై మాత్రమే దృష్టి పెట్టాలి.

కానీ పక్కవారి అభిప్రాయాలను మాత్రం తీసుకోవద్దు. ఏ రంగంలోనైనా సపోర్ట్ చేసే నెట్ వర్క్ కలిగి ఉండడం ముఖ్యం. నాకు మద్దతు ఇచ్చేవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నందుకు సంతోషిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

2008 నుంచి ప్రారంభమైన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది ఆదా శర్మ. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగినట్లు చెప్పారు.

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆదా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ది కేరళ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో నటిస్తుంది.