
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ ఇటీవల రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. భార్య లలిత ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సుహాస్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

సుహాస్-లలిత లది ప్రేమ వివాహం. ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు నో చెప్పేసరికి 2017లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు

వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది జనవరిలో సుహాస్ భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి వీరికి కొడుకు పుట్టాడు. దీంతో సుహాస్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.

తాజాగా తన రెండో కుమారుడి బారసాల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు సుహాస్-లలిత దంపతులు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా భార్య లలిత, ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు సుహాస్. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

సుహాస్ ఫ్యామిలీ ఫొటోస్ చూసిన నెటిజన్లు హీరోకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా ఓజీలోనూ ఓ క్యామియో రోల్ చేశాడు సుహాస్. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.