
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే క సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం. ఈ మూవీతోనే తెలుగు తెరకు కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది రహస్య గోరఖ్. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇటీవలే పెద్దల సమక్షంలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత రహస్య సినిమాలకు దూరంగా ఉండగా.. కిరణ్ అబ్బవరం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే ప్రెగ్నెన్సీ శుభవార్తను పంచుకున్నారు.

తాజాగా కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరఖ్ సీమంతం వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో పంచుకున్నారు రహస్య. అందులో బేబీ బంప్, కిరణ్ అబ్బవరంతో కలిసిన ఫోటోస్ ఉన్నాయి.

దీంతో రహస్య, కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇటీవలే దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.