Sir Movie: తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోన్న తమిళ్ స్టార్ ధనుష్.. హౌస్‏ఫుల్ బోర్డులతో ..

| Edited By: Rajeev Rayala

Feb 17, 2023 | 5:05 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సార్ సినిమాతో నేరుగా వెండితెరపై సందడి చేయబోతున్నారు.

1 / 8

2 / 8
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/‌ 'వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

3 / 8
ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో 'సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి.

4 / 8
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ రేపు అంటే ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ క్రమంలోనే  బుధవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈ వేడుకకు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

5 / 8
ఈ వేడుకలో ధనుష్ నేరుగా తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నాడు. అయితే మధ్యలో ఆయనకు మాటలు సాయం అందించారు త్రివిక్రమ్. అలాగే తెలుగులో మాస్టారూ.. మాస్టారూ సాంగ్ పాడి మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

6 / 8
 టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో ధనుష్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆయన  నటిస్తోన్న సార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా..   ఫిబ్రవరి 16న అర్ధరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‏లో ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది.

7 / 8
 అయితే ఇప్పటికే సార్ చిత్రానికి థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయట. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.  అంతేకాదు.. ఆల్రెడీ ఈ సినిమా చూసిన క్రిటిక్స్ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. మొత్తానికి తెలుగులో భారీ హిట్ అందుకోనున్నట్లుగానే తెలుస్తోంది.

8 / 8
తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోన్న తమిళ్ స్టార్ ధనుష్..  హౌస్‏ఫుల్ బోర్డులతో 'సార్'