
తన మనసు బంగారం అని తాజాగా ప్రూవ్ చేసుకున్నాడు శిరీష్. ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. బాధిత చిన్నారిని, అతని కుటుంబాన్ని తన ఆఫీసుకు ఆహ్వానించిన శిరీష్.. వారి బాగోగులు తెలుసుకోని.. చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేశాడు.

శిరీష్ మంచి మనసు తెలుసుకున్న నెటిజన్లు అతడి ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మనకున్నంతలో కొంత సాయం.. వేరే వారి జీవితాన్ని నిలబెడుతుందని కామెంట్స్ పెడుతున్నారు. శిరీష్ నుండి ఇంత సపోర్ట్ లభించినందుకు ఆ చిన్నారి కుటుంబ సభ్యలు ధన్యవాదాలు చెబుతున్నారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు.. అయినప్పటికీ పదే, పదే వారి పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుకోకుండా తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ కోసం అల్లు శిరీష్ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు.

ఆన్‌లైన్‌లో కామెంట్లు చూసినప్పుడే నెగెటివిటీని ఎక్కువగా ఫీలవుతానని.. అందుకే గత రెండున్నర ఏళ్లుగా సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నట్లు అల్లు శిరీష్ గతంలో వెల్లడించారు.

ఇప్పటివరకు 7 సినిమాల్లో నటించాడు శిరీష్. ఊర్వశివో.. రాక్షసివో వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ తన తదుపరి సినిమా గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఈ నటుడు.