
జవాన్ సక్సెస్‌తో నేషనల్ మార్కెట్‌నుషేక్ చేసిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత బన్నీ చేస్తున్న సినిమా కావటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకే ఆ అంచనాలను అందుకునేందుకు హిట్ సెంటిమెంట్స్‌ను రిపీట్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ. జవాన్ సినిమాలో నయనతారతో పాటు దీపిక, ప్రియమణి కూడా ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు.

ఇప్పుడు ఏఏ 22లోనూ ఐదుగురు హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ దీపిక పదుకోన్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కన్ఫార్మ్ అయ్యాయి.

భాగ్యశ్రీ బోర్సేతో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. విలన్ విషయంలోనూ జవాన్ సెంటిమెంట్‌నే రిపీట్ చేస్తున్నారు.

ఆ మూవీలో నెగెటివ్ రోల్ చేసిన విజయ్ సేతుపతి, ఏఏ 22లో ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా జవాన్ సక్సెస్‌లో హెల్ప్ అయిన అన్ని విషయాలు రిపీట్ చేస్తూ బన్నీ మూవీ మీద అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.