
సాధారణంగా హీరో, డైరెక్టర్ల కాంబినేషన్ గురించే ఎక్కువగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈ ఫార్ములాను దాటి డైరెక్టర్, సంగీత దర్శకుల కాంబో గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అభిమానులు. రీసెంట్ బ్లాక్ బస్టర్స్‌లో ఈ కాంబినేషన్సే కీ రోల్ ప్లే చేశాయి.

రీసెంట్ టైమ్స్‌లో సూపర్ హిట్ అయిన సినిమాల విషయంలో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేస్తోంది. ఎక్కువగా సాంగ్స్ లేకపోయినా.. ఉన్న ఒకటి రెండు పాటలు ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా ఉంటున్నాయి. ముఖ్యంగా దర్శకుడితో పర్ఫెక్ట్ సింక్‌లో ఉంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ల విజువల్స్‌కు మరింత హైప్ తీసుకువస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయిన యానిమల్ సంగీతం ఒక రేంజ్. ముఖ్యంగా సందీప్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అయిన హర్షవర్దన్, విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసే మ్యూజిక్ ఇచ్చారు.

సలార్ సినిమా సక్సెస్‌లో సంగీతందే మేజర్ పార్ట్. ప్రశాంత్ నీల్ తో ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్న రవి బస్రూర్ సలార్, కేజీఎఫ్ సినిమాల్లో యాక్షన్ సీన్స్‌లో మ్యూజిక్‌తో గూజ్‌బంప్స్ తెప్పించారు.

కోలీవుడ్‌లోనూ ఇలాంటి క్రేజీ కాంబినేషన్సే బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాయి. ప్రజెంట్ కోలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న అనిరుద్, ప్రతీ దర్శకుడితోనూ సూపర్బ్‌గా జెల్ అవుతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్స్ విక్రమ్, జైలర్, లియో లాంటి సినిమాల విషయంలో అనిరుధ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. అందుకే ఈ కాంబోస్ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు.