అనాఫిలాక్సిస్ అనేది ఒక అలెర్జీ కారకానికి తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య. దీని వలన శరీరం తీవ్ర సున్నితత్వం చెందుతుంది. బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల, అలెర్జీకి దారితీస్తుంది. దాని ఫలితంగా గొంతు బిగుతుగా మారటం, బ్రోంకోస్పాస్మ్ ఏర్పడవచ్చు.
అధ్యయనాల ప్రకారం, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. ఇది మూత్ర ఆక్సలేట్ విసర్జనను పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల అభివృద్ధికి దారితీస్తుంది. అందుకే బీట్‌రూట్ జ్యూస్‌ను మితంగా తాగాలని సూచిస్తున్నారు. అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
బీట్‌రూట్‌తో కొలెస్ట్రాల్ సమస్యను కంట్రోల్ చేయవచ్చు. బీట్ రూట్‌ని ప్రతిరోజూ ఇలా తీసుకుంటే.. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. బీట్ రూట్‌ని సలాడ్ రూపంలో తీసుకుంటే.. కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా తగ్గుతాయి.
బీట్ రూట్‌ని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి అనేది తగ్గుతుంది. రుచి కోసం ఇందులో నిమ్మరసం, పెప్పర్ పొడి, ఉప్పు వంటవి కలిపి తాగవచ్చు. పల్చగా తాగితే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ ఈజీగా తగ్గుతాయి.
బీట్ రూట్ రైతా, బీట్ రూట్ దోశలు, ఇడ్లీలు, కర్రీ, ఫ్రై వంటి వంటలు కూడా తయారు చేసుకుని తిన్నా.. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతాయి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)