
చెక్కు చెదరని అందం కోసం కనీసం నెలకు ఒకసారి అయినా ఫేషియల్ చేయించుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఇది చర్మ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం విస్తీర్ణం పెరుగుతుంది. చాక్లెట్‌తో ఫేషియల్ చేసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు.

చాక్లెట్ ఫేషియల్ చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో కోకోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చాక్లెట్ ఫేషియల్ చర్మం మంటను తగ్గిస్తుంది. కోకో బటర్ చర్మాన్ని తేమగా ఉంచే మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఫేషియల్ చర్మం చికాకు, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మీరు ఇంట్లోనే ఈ ఫేషియల్ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే..

రోజువారీ ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ముఖంపై ఉన్న మేకప్, మురికి, నూనె అన్నీ తొలగిపోయేలా చూసుకోవాలి. తర్వాత శుభ్రమైన టవల్‌తో ముఖాన్ని తుడవండి. డార్క్ చాక్లెట్‌ను కరిగించడానికి.. మైక్రోవేవ్‌లో డార్క్ చాక్లెట్‌ను వేడి చేయవచ్చు. తర్వాత కరిగిన డార్క్ చాక్లెట్ గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు పక్కన ఉంచుకోవాలి. తర్వాత అందులో తేనె, పుల్లటి పెరుగు కలపాలి. అంతే చాక్లెట్ ఫేషియల్ తయారైనట్లే.

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, మాయిశ్చరైజింగ్ ప్రభావం ఉంటుంది. పుల్లని పెరుగులో ఎక్స్‌ఫోలియేటింగ్ పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. ఇప్పుడు ఈ చాక్లెట్ ఫేస్ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేయాలి. 15-20 నిమిషాలు తర్వాత ఫేస్ ప్యాక్ ఆరిపోతుంది. తర్వాత తడి చేతులతో ముఖాన్ని స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ముఖం తుడుచుకుని, ఇష్టమైన మాయిశ్చరైజర్ ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.