ఆకలి లేని వారు చింతకాయ పచ్చి రొయ్యల కూర తింటే ఆ సమస్య పరార్

Updated on: Jun 05, 2026 | 12:48 PM

Chintakaya royyalu curry: చింతకాయలతో పచ్చి రొయ్యలు కూర చేసి తింటే ఆ రుచి ఎక్కడా దొరకదు ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు ఇంకా ఇది పుల్ల పుల్లగా కారంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం ..

1 / 5

 చింత కాయ పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్దాలు : ముప్పావు కేజీ పచ్చి రొయ్యలు, 5 చింత కాయలు, రెండు ఉల్లిపాయలు,  టమాటాలు, రెండు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్  మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు ఆకులు,  కొత్తిమీర, చింతపండు రసం,  నూనెను తీసుకోవాలి.

2 / 5
 పచ్చి రొయ్యలను ఉడికించుకోవాలి : ముందుగా పచ్చి రొయ్యలను ఉప్పులో నానబెట్టి వాటిని క్లీన్ చేసి మధ్యలో ఉన్న నల్ల దారాన్ని తీసివేయండి. ఇంకా దీనిలో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి 10 నిమిషాల పాటు గిన్నెలో ఉంచాలి.
ఇప్పుడు చింత కాయలను తీసుకుని కడిగి మట్టి పోయే వరకు శుభ్రపరచుకోవాలి.

పచ్చి రొయ్యలను ఉడికించుకోవాలి : ముందుగా పచ్చి రొయ్యలను ఉప్పులో నానబెట్టి వాటిని క్లీన్ చేసి మధ్యలో ఉన్న నల్ల దారాన్ని తీసివేయండి. ఇంకా దీనిలో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి 10 నిమిషాల పాటు గిన్నెలో ఉంచాలి. ఇప్పుడు చింత కాయలను తీసుకుని కడిగి మట్టి పోయే వరకు శుభ్రపరచుకోవాలి.

3 / 5
అయితే, రొయ్యలను మరి మెత్తగా  ఉడకబెట్టకూడదు. ఇలా చేస్తే రుచికరంగా ఉంటాయి.  పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అది  బాగా వేడి అయినా తరువాత   రొయ్యలు కూడా వేసి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి.  ఒకటి మర్చిపోకండి వీటిని మరి మెత్తగా వద్దు   లేదంటే గట్టిగా అవుతాయి. వీటిని ఒక గిన్నెలో వేసుకోవాలి.

4 / 5
మళ్ళీ పాన్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది వేడి అయినా తర్వాత  కరివేపాకు ఆకులు ,  పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి రంగు మారే  వరకు స్టవ్ మీదే బాగా వేయించాలి. ఇంకా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  వాసన పోయే వరకు ఉడికించాలి.  టమాటాలు కూడా మెత్తగా అయ్యే దాకా వేయించాలి

5 / 5
ఇప్పుడు ఈ మసాలాలో చింతకాయ పేస్ట్,  పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల  పొడి కూడా  వేసి కలపాలి.  ఇంకా చింత కాయ పేస్ట్  ఉడికే వరకు ఇలాగే మూతపెట్టి 15 నిమిషాల పాటు అలా ఉంచాలి అప్పుడు రొయ్య ముక్కలు కూడా మగ్గుతాయి. అంతే, వేడి వేడి చింత కాయ పచ్చి రొయ్యల కూర రెడీ

Follow Us