చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

Updated on: Mar 28, 2026 | 5:38 PM

Chinta tokku Chepala Pulusu Kura: కొందరు చింత తొక్కు లేదా చింతకాయలతో చేపల కూర వండుకుని తింటారు. అయితే, దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ అదిరిపోతోంది. ఒకసారి తిన్న వాళ్ళు ఆపకుండా తింటారు. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్దాలు : ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి  శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో  పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును పట్టించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు గ్యాస్ స్టవ్  వెలిగించి దానిలో ఆయిల్ వేసి అదే వేడయ్యాక దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ గస గసాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వాటిని బాగా వేయించి  పొడి లాగా చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి,  ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్  పసుపు, కారం, ఉప్పు వేసి  బాగా రంగు మారే వరకు పొయ్యి మీదే బాగా ఉడికించాలి.

4 / 5
అలాగే, చింతకాయ పేస్ట్ ను కూడా వేసి, అలాగే వాటితో పాటు ఒక గ్లాస్ చింతపండు రసం పోసి స్టవ్ మీదే ఉంచి  బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్న పులుసులో ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి ఉడికించాలి.

5 / 5

ఇక ఇప్పుడు చేపల ఉడికించుకునే పాత్ర మీద మూత పెట్టి  మీడియం మంటపై ముక్కలను బాగా ఉడికించాలి. దించేముందు  కొత్తిమీర వేసి అన్నంలో తింటే రుచి అదిరిపోద్ది. అంతే అంతే వేడి వేడి చింతకాయల చేపల కూర రెడీ.

Follow Us