Chemical Free Food: కూరగాయలు, పండ్లపై రసాయనాలను తొలగించే చిట్కాలు.. రోజూ ఇలా శుభ్రం చేసి వాడేయండి

|

Aug 25, 2024 | 12:56 PM

ఈ రోజుల్లో పంటలకు రసాయనాల వాడకం సాధారణమై పోయింది. కూరగాయలు, పండ్లను పండించే రైతులు కీటకాల నుంచి కాపాడేందుకు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. అలాగే దిగుబడి రేటు పెంచడానికి కూడా రకరకాల రసాయనాలు, పురుగుమందులు వాడుతున్నారు. అయితే ఇలా రసాయనాలు చల్లి పండించిన ఆహారాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే కూరగాయల నుంచి రసాయనాలను ఎలా తొలగించి..

1 / 5
ఈ రోజుల్లో పంటలకు రసాయనాల వాడకం సాధారణమై పోయింది. కూరగాయలు, పండ్లను పండించే రైతులు కీటకాల నుంచి కాపాడేందుకు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. అలాగే దిగుబడి రేటు పెంచడానికి కూడా రకరకాల రసాయనాలు, పురుగుమందులు వాడుతున్నారు. అయితే ఇలా రసాయనాలు చల్లి పండించిన ఆహారాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే కూరగాయల నుంచి రసాయనాలను ఎలా తొలగించి, వాడుకోవాలనేది పెద్ద సమస్యగా మారింది. ఈ కింది చిట్కాల ద్వారా వాటి ప్రభావం కొంత మేర తగ్గించుకోవచ్చు.

2 / 5
కూరగాయలను ఉడికించే ముందు గోరువెచ్చని నీటిలో శుభ్రంగా కడిగితే టాక్సిన్స్ తొలగిపోతాయి. అధిక వేడి లేదా మరింత చల్లటి నీటిలో కడగడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే గోరువెచ్చని నీటిని వాడాలి. పండ్లను కూడా అదే విధంగా కడిగి తినడం మంచిది.

3 / 5
ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని అర చెంచా ఉప్పు వేయాలి. తద్వారా ఉప్పు అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ ఉప్పు నీటిలో పండ్లు, కూరగాయలను వేసి కడగాలి. ఆపై వాటిని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఆహారం రసాయన రహితంగా మారుతాయి.

4 / 5
చాలా రసాయనాలు కూరగాయల తొక్కలపై పేరుకుపోతాయి. క్రిమిసంహారకాలను తొలగించడానికి నీటితో కడిగిన తర్వాత, ఒక పెద్ద గిన్నెలో వెనిగర్‌ వేసి కాసేపు నానబెట్టాలి. తర్వాత సాధారణ నీళ్లలో కడగాలి. ఆపై వంటకు ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఉల్లిపాయ, బంగాళాదుంప, ఆపిల్, నారింజ, అల్లం, మామిడి, క్యారెట్, ముల్లంగి, దుంప వంటి పండ్లు, కూరగాయలను తొక్కతీయడం చాలా సులభం. అటువంటి ఆహారాన్ని బాగా కడిగిన తర్వాత, దాని పై తొక్క తీయాలి.

5 / 5
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు నీటిలో వేసి పలుచగా చేసుకోవాలి. దీనిపి స్ర్పే బాటిల్‌లో పోసి చల్లని ప్రదేశంలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పండ్లు, కూరగాయలపై స్ప్రే చేసినా మంచిదే.