- Telugu News Photo Gallery Check here to know health benefits by Broccoli if you consume it regularly
Health Tips: చలికాలంలో బ్రకోలీని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే తినకుండా ఆగలేరు..
శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక జాగ్రత్తలను పాటించాలి. లేకుంటే అనేక సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. అందుకోసం ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న ఆహారపదార్థాలను నిత్యం తీసుకోవడం తప్పనిసరి.మరి ఆ పోషక విలువలన్నీ నిండుగా ఉన్న బ్రకోలీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Dec 22, 2022 | 1:24 PM

శీతాకాలంలో బ్రకోలీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది. బ్రకోలీలో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ సీ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బ్రకోలీని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

బ్రకోలీలో పుష్కలంగా ఉండే పీచు పదార్థం మన జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది. అంతేకాక చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది బ్రకోలీ.

బ్రకోలీని చలికాలంలో తినడం వల్ల కాలేయానికి కూడా చాలా మేలు జరుగుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో ముఖ్యపాత్ర వహించి, కాలేయ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బ్రోకలీలో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బ్రకోలీ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

బ్రకోలీలో విటమిన్ సీ పుష్కలంగా ఉండడం వల్ల మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండడంలో కూడా బ్రకోలీ ఉపకరిస్తుంది.




