- Telugu News Photo Gallery Cinema photos Year Ender 2022 Do yo Know These south movies are biggest box office failures in this year telugu cinema news
Year Ender 2022: ఈ ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సౌత్ సినిమాలు ఇవే..
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సత్తా చాటాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవల్లో విడుదలైన చిత్రాలు సంచలనం సృష్టించాయి. అంతేకాకుండా.. రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. కానీ అదే సమయంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కొన్ని చిత్రాలు మాత్రం నిరాశను మిగిల్చాయి.
Updated on: Dec 22, 2022 | 11:24 AM

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సత్తా చాటాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవల్లో విడుదలైన చిత్రాలు సంచలనం సృష్టించాయి. అంతేకాకుండా.. రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. కానీ అదే సమయంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కొన్ని చిత్రాలు మాత్రం నిరాశను మిగిల్చాయి.

రాధేశ్యామ్.. డైరెక్టర్ రాధాకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన రాధేశ్యామ్ నిరాశను మిగిల్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది.

ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో చిరు, చరణ్ నటనపై ప్రశంసలు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

థాంక్యూ.. టాలెంటెడ్ హీరో నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా విజయం అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను, సినీ విమర్శకులను నిరాశపరిచింది.

మాచర్ల నియోజకవర్గం.. నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం పరాజయం చవిచూసింది.

లైగర్.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ది ఘోస్ట్ .. కింగ్ నాగార్జున్.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

అలాగే ఖిలాడి, రంగ రంగ వైభవంగా, నేను మీకు బాగా కావాల్సినవాడిని, సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.





























