విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.? రూ. లక్షలోపు బడ్జెట్‌తో ఈ దేశాలు ఎంచక్కా చుట్టేయొచ్చు..!

|

Mar 04, 2024 | 12:00 PM

ఏదొక టైంలో ఓ జాలీ ట్రిప్‌కు విదేశాలకు వెళ్లాలని అందరికీ ఉంటుంది. కానీ విదేశాలకు వెళ్లాలంటే మాటలా.. విమానం ఛార్జీలు, హోటల్ ఖర్చులు, ఫుడ్, మొదలైన వాటితో బిల్లులు తడిసి మోపెడు అవుతుంటాయి.

1 / 5
ఏదొక టైంలో ఓ జాలీ ట్రిప్‌కు విదేశాలకు వెళ్లాలని అందరికీ ఉంటుంది. కానీ విదేశాలకు వెళ్లాలంటే మాటలా.. విమానం ఛార్జీలు, హోటల్ ఖర్చులు, ఫుడ్, మొదలైన వాటితో బిల్లులు తడిసి మోపెడు అవుతుంటాయి. ఆ టెన్షన్ మీకు అక్కర్లేదు. భారత్‌కు సమీపాన ఉన్న కొన్ని దేశాలను మీరు తక్కువ ఖర్చుతో ఓసారి చుట్టేయొచ్చు. మిడిల్ క్లాస్ బడ్జెట్.. సౌకర్యవంతమైన ప్రయాణం.. మరి ఆ దేశాలపై ఓ లుక్కేద్దాం.

2 / 5
మలేషియా: బీచ్‌లు, అడవులు, చారిత్రాత్మక కట్టడాలు.. ఇలా మలేషియాలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ దేశంలో రకరకాల పువ్వులను మీరు చూడవచ్చు. ఇక్కడ ఫుడ్‌ కూడా పర్యాటకులకు బాగా నచ్చుతుంది. విమానం ఛార్జీ: రూ. 35-45 వేలు ఉండొచ్చు

3 / 5
కంబోడియా: కంబోడియాలో అంగ్కోర్ వాట్ దేవాలయం ప్రసిద్ధి. ఇక్కడ రాయల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం, చారిత్రిక ప్రదేశాలు అనేకం. ఇలా ఎన్నో విశిష్టలు ఉన్న కంబోడియాకి ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. విమానం ఛార్జీ: రూ. 31-62 వేలు ఉండొచ్చు

4 / 5
శ్రీలంక: బీచ్‏లు, పర్వతాలు, పచ్చని ప్రకృతికి లంక పెట్టింది పేరు. మన దేశానికి ఇది పక్కనే.. అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. లంకలోని కొలంబో, నేగోమ్బో నగరాలు పర్యాటకంగా చూడదగ్గ ప్రదేశాలు. విమానం ఛార్జీ: రూ. 10-25 వేలు  ఉండొచ్చు

5 / 5
నేపాల్: ఇండియన్స్ ఈ దేశానికి వెళ్లడానికి వీసా అక్కర్లేదు. ఇక్కడి భౌద్ధ స్టూపాలను చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. అలాగే మౌంట్ ఎవరెస్ట్‏తోపాటు.. ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలకు ఈ నేపాల్ ప్రసిద్ధి. విమానం ఛార్జీ: రూ. 29-55 వేలు ఉండొచ్చు, నేపాల్ బోర్డర్‌లో ఉన్నవారికి.. బస్సులో నేపాల్ చేరుకోవడం చాలా చౌక.