Charcoal Soap For Skin: బొగ్గుతో తయారు చేసిన సబ్బు.. ఎందుకు వాడుతారో తెలుసా?
చర్మ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అలాగే శరీరంపై మురికి, బ్యాక్టీరియా, నూనెను శుభ్రం చేయడానికి సబ్బుతో క్రమం తప్పకుండా స్నానం చేయడం కూడా అవసరం. నేటికాలంలో చాలా మంది చార్‌కోల్ ఫేస్‌వాష్ వాడుతున్నారు. చార్‌కోల్ ఫేస్ వాష్ ముఖంలోని మురికిని, అలాగే అదనపు నూనెను సులువుగా తొలగిస్తుంది..
Updated on: Jan 19, 2024 | 8:54 PM

చర్మ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అలాగే శరీరంపై మురికి, బ్యాక్టీరియా, నూనెను శుభ్రం చేయడానికి సబ్బుతో క్రమం తప్పకుండా స్నానం చేయడం కూడా అవసరం. నేటికాలంలో చాలా మంది చార్‌కోల్ ఫేస్‌వాష్ వాడుతున్నారు. చార్‌కోల్ ఫేస్ వాష్ ముఖంలోని మురికిని, అలాగే అదనపు నూనెను సులువుగా తొలగిస్తుంది.

చర్మ సమస్యలను తగ్గించడానికి చార్‌కోల్ సోప్ కూడా సహజ నివారిణి. బొగ్గు చర్మ సమస్యలను నయం చేయడంతో పాటు చర్మంలోని మురికి, నూనెను శుభ్రపరుస్తుంది. అయితే ఎల్లప్పుడూ యాక్టివేటెడ్ చార్‌కోల్ సబ్బును మాత్రమే ఉపయోగించాలి. చార్‌కోల్ సోప్ జిడ్డు చర్మంపై బాగా పనిచేస్తుంది. జిడ్డు చర్మం అధిక సెబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వైట్ హెడ్స్, మొటిమల సమస్యలను కలిగిస్తుంది. బొగ్గు సబ్బుతో స్నానం చేయడం వల్ల చర్మంలోని అదనపు జిడ్డు తొలగిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.

యాక్టివేటెడ్ చార్‌కోల్ సోప్ మొటిమల నివారణకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని కాలుష్య కారకాలను తొలగిస్తుంది. మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. వెన్ను, ఛాతీపై వచ్చే మొటిమలను వదిలించుకోవడానికి యాక్టివేటెడ్ చార్‌కోల్ సబ్బును ఉపయోగించవచ్చు.

చర్మంపై ఓపెన్ రంధ్రాలు ఉంటే జిడ్డుగల చర్మ సమస్యలు చాలా అరుదుగా వస్తాయి. రంధ్రపు నోరు తెరిచి ఉంటే, అక్కడ మురికి, బ్యాక్టీరియా పేరుకుపోతుంది. యాక్టివేటెడ్ చార్‌కోల్ సోప్ తెరుచుకున్న రంధ్రాల సమస్యను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

యాక్టివేటెడ్ చార్‌కోల్ సబ్బును ఉపయోగించడం వల్ల చర్మ అకాల వృద్ధాప్యాన్ని కూడా నిరోధించవచ్చు. ఈ యాంటీ ఏజింగ్ సబ్బు ముడతలను తొలగి, చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుంచి రక్షిస్తుంది. జిడ్డు చర్మానికి యాక్టివేటెడ్ చార్‌కోల్ సబ్బు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పొడి, సున్నితమైన చర్మానికి కూడా యాక్టివేటెడ్ చార్‌కోల్ సోప్ వాడవచ్చు. ఈ సబ్బు పొడి చర్మాన్ని తేమగా ఉంచి, సున్నితమైన చర్మాన్ని అలెర్జీల నుంచి రక్షిస్తుంది.




