Chanakya Niti: మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఇలాంటి వీరిని గుడ్డిగా నమ్మవద్దు.. చాలా నష్టపోతారు!

Updated on: Feb 23, 2026 | 1:48 PM

జీవితంలో పురోగతి, మనుగడకు చాణక్య నీతి చాలా ముఖ్యమైనది. జీవితాన్ని మంచి మార్గంలో గడపడానికి ఆచార్య చాణక్య ఆయన రచించిన ఆర్ధశాస్త్రంలో అనేక చిట్కాలను చెప్పాడు. ఈ క్రమంలో ప్రశాంతమైన జీవనానికి సమాజంలో కొన్ని రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్య నీతి సలహా ఇస్తుంది..

1 / 5
ఎదుటి వారి మన్నన పొండానికి, వారి దృష్టిలో మంచివాడిగా ఉండటానికి మీరు ఎల్లప్పుడూ వారి అభిప్రాయంతో ఏకీభవించే అలవాటు మీకూ ఉందా? ఇది మిమ్మల్ని కష్టాలపాలు చేస్తుందని ఆచార్య చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.

2 / 5
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీ సమయం, కృషి, నిర్ణయాలను గౌరవించాలి. ఒక వ్యక్తి సరైన మాటలు మాట్లాడటం ద్వారా విలువైనవాడు అవుతాడు. కాబట్టి మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే, దానిని నెరవేర్చండి. అప్పుడే వారు మిమ్మల్ని గౌరవిస్తారు.

3 / 5
ఎవరైనా ఎంత ప్రతిభావంతులైనా, కష్టపడి పనిచేసే అలవాటు లేకపోతే.. అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారితో స్నేహం మిమ్మల్ని జీవితంలో ఊహించని విధంగా వెనక్కి నెట్టగలదు. సోమరితనం ఉన్నవారితో పనిచేయడం లేదా స్నేహం చేయడం వల్ల మీ సమయం, శక్తి రెండూ వృధా అవుతాయి.

4 / 5
కొంతమందికి చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. వారు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తారు. వారితో సమయం గడపడం వల్ల మీరు ఒత్తిడికి గురవుతారు. అలాంటి వారికి దూరంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది.

5 / 5
ఎదుటి వ్యక్తిని బాధపెట్టకుండా ఉండేందుకు వారి అభిప్రాయంతో ఎల్లప్పుడూ ఏకీభవించడం తప్పు. మీరు మీ అభిప్రాయాన్ని ఎవరితోనూ పంచుకోకపోతే, ఎదుటి వ్యక్తి తప్పులను ఎత్తి చూపకపోతే, భవిష్యత్తులో మీకు గౌరవం తగ్గుతుంది.

Follow Us