Causes of Snoring: చిన్న వయసులోనే గురక వస్తుందా? జాగ్రత్త.. ఆ సమస్యలకు ఇది సంకేతం

Updated on: Dec 27, 2023 | 12:15 PM

గురక అనేది చాలా సాధారణ సమస్య. ఈ రోజుల్లో అనేక మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మంది గురకను చెడు అలవాటుగా భావిస్తారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గురక పెట్టినప్పటికీ, కొందరికి ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే.. రోజువారీ గురక అనారోగ్యకరం. బరువు తగ్గడం, పడుకునే ముందు మద్యం సేవించకపోవడం వంటి జీవనశైలి మార్పులు గురకను నివారించడంలో సహాయపడతాయి. గురకను తగ్గించడంలో సహాయపడే వివిధ మందులు, శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి..

1 / 5
గురక అనేది చాలా సాధారణ సమస్య. ఈ రోజుల్లో అనేక మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మంది గురకను చెడు అలవాటుగా భావిస్తారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గురక పెట్టినప్పటికీ, కొందరికి ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే.. రోజువారీ గురక అనారోగ్యకరం. బరువు తగ్గడం, పడుకునే ముందు మద్యం సేవించకపోవడం వంటి జీవనశైలి మార్పులు గురకను నివారించడంలో సహాయపడతాయి. గురకను తగ్గించడంలో సహాయపడే వివిధ మందులు, శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. నిజానికి గురక తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమనే విషయం చాలా మందికి తెలియదు.

2 / 5
NCBI ప్రకారం.. గురక వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 46 శాతం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో గురక ధమనుల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం బెటర్‌.

3 / 5
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఎక్కువగా గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. బాత్రూమ్‌కి వెళ్లడానికి రాత్రికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మేల్కొనడాన్ని నోక్టురియా అంటారు. ఇది పురుషులు, స్త్రీలలో గురకతో కూడా సంబంధం కలిగి ఉంటుంది.

4 / 5
మధుమేహం, స్లీప్ అప్నియాపై యేల్ యూనివర్శిటీ చేసిన అధ్యయనం ప్రకారం.. సాధారణంగా గురక వచ్చే వారితో పోల్చితే గురక లేనివారి కంటే మధుమేహం వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువ. స్లీప్ అప్నియా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

5 / 5
నిద్రపోతున్నప్పుడు గురక పెట్టే వ్యక్తులు లేదా ఇతర శ్వాస సమస్యలు ఉన్నవారు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంత చిన్నవారైతే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది.