
అన్ని పండ్లలో కంటే.. అరటి పండ్లనే ఎక్కువగా తింటూ ఉంటారు. అరటి పండ్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎవరి కావాల్సినవి వాళ్తు తెచ్చుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా.. అరటి పండ్లనే తీసుకెళ్తారు. ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా అరటి పండ్లను తినొచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా.. చవగా లభ్యమవుతాయి. దీంతో అందరూ తింటూ ఉంటారు.

అంతే కాకుండా ఇవి అన్ని కాలాల్లో కూడా విరివిగా లభ్యమవుతూ ఉంటాయి. అరటి పండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువే. పిల్లలకు ఎక్కువగా ఇస్తూ ఉంటే వారిలో మల బద్ధకం సమస్య ఉండదు. అదే విధంగా పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారు.

అరటి పండు తింటే ఒక్కటేంటి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో క్యాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ అరటి పండు తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

అయితే చాలా మంది శీతా కాలంలో అరటి పండ్లు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని దూరం పెడతారు. మరి వింటర్ సీజన్‌లో అరటి పండ్లు తినొచ్చా? నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ప్రతి రోజు అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చలి కారణంగా వచ్చే ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే విధంగా జీర్ణ క్రియ సమస్యతో బాధ పడుతున్న వారు అరటి పండు తింటే పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు.