Toyota Hilux: ప్రస్తుతం వివిధ రకాల కార్ల తయారీ కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
తాజాగా ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ వాహనాలకు పోటీగా ప్రత్యర్థి జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా భారత మార్కెట్లలోకి సరికొత్త పికప్ ట్రక్‌ను విడుదల చేయనుంది.
అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో అత్యంత ప్రజాదరణను పొందిన హిలక్స్ పికప్ వాహనాన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
టాయోటా హిలక్స్ 3000ఎంఎం వీల్‌బేస్‌తో అందుబాటులోకి రానుంది. టూ డోర్, ఫోర్ డోర్ కాన్ఫిగరేషన్స్‌తో లభించనుంది. దీని ధర రూ.25-35 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది.