Car Sales: రూ. 10 లక్షలలోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..

|

Feb 15, 2023 | 8:32 PM

మీరు కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. రూ. 10 లక్షల బడ్జెట్‌లో.. బెస్ట్ మైలేజ్ అందించే ఎన్నో గొప్ప కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్టులో మారుతి ఆల్టో, మహీంద్రా థార్ వంటి టాప్ మోడల్స్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?

1 / 5
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి ఆల్టో ఒకటి. ఆల్టో కె10 వెర్షన్ కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది.  దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 - 5.95 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఈ కారు CNGలో 33.85 km/kg మైలేజీని అందిస్తుంది.

2 / 5
టాటా టియాగో, ఈ కారు పెట్రోల్, సిఎన్‌జి వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారు కిలో సీఎన్‌జీకి 26.49 కిమీ మైలేజీని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.45 - 7.9 లక్షలు వరకు ఉంటుంది. కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా మార్కెట్‌లో ఉంచింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.49 లక్షలు.

3 / 5
సిత్రోన్(Citroen) C3 మోడల్‌ రూ. 10 లక్షలకు అందుబాటులో ఉంది. ఇది SUV లాగే ఉంటుంది. ఇక ఈ అద్భుతమైన కారును రూ.5.98 - 8.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

4 / 5
మీరు రూ. 10 లక్షలతో 7 సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, రెనాల్ట్ ట్రైబర్ బెస్ట్ ఆప్షన్. విశేషమేమిటంటే, దేశంలో 7 మంది కూర్చోగలిగే 10 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన ఏకైక MPV ఇదే. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6 - 8.63 లక్షలు.

5 / 5
మీరు రూ. 10 లక్షలకు కొత్త ఆఫ్-రోడ్ SUVని కూడా కొనుగోలు చేయవచ్చు. మహీంద్రా థార్‌ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. ఇది 4 సీట్ల SUV కాగా, దీని రైడింగ్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.