
Gold Price: బంగారం ధరలు ఈరోజు రికార్డు స్థాయికి పెరిగాయి మరియు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో, MCXలో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

స్టాకిస్టుల నిరంతర కొనుగోళ్లు, రూపాయి పతనం కారణంగా శుక్రవారం ఢిల్లీలో బంగారం ధరలు రూ.2,100 పెరిగి 10 గ్రాములకు రూ.1,03,670కి చేరాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధృవీకరించింది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,01,570 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్‌లో తులం ధర రూ.1,03,310 ఉండగా, ముంబైలో రూ.1,03,310 ఉంది.

ఆగస్టు 8న 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం వరుసగా 10 గ్రాములకు రూ.1,03,420,రూ.1,03,000 లకు చేరుకుంది. ఆ తర్వాత వాటి ధరలు 10 గ్రాములకు రూ.800 పెరిగాయి. ఆగస్టు 7న బంగారం ధరలు 10 గ్రాములకు రూ.3,600 భారీగా పెరిగాయి. రూపాయి బలహీనత, విదేశీ మార్కెట్లో సానుకూల ధోరణి కారణంగా దేశీయ మార్కెట్లో బంగారం పెరుగుదల కనిపించింది. అది కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.

శుక్రవారం రూపాయి మొదటిసారిగా 88 మార్కును దాటి US డాలర్‌తో పోలిస్తే 88.19 (తాత్కాలిక) వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. భారతదేశం -US మధ్య వాణిజ్య ఒప్పందంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య రూపాయి 61 పైసలు పడిపోయింది. ఈ వారంలో బంగారం ధరలు రూ.3,300 లేదా 3.29 శాతం పెరిగాయి.

ఇదిలా ఉంటే వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,19,900 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.1,29,900 వద్ద ఉంది.