
పేరుకు తగినట్టుగానే టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు ఎత్తయిన ప్రాంతాలపైకి పరుగులు తీస్తుంది. దీనిలోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నుంచి 118 హెచ్ పీ, 170 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. 165 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు సుమారు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.9.49 లక్షల నుంచి 10.99 లక్షల మధ్య ఉంది.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ రెండు రకాల ఇంజిన్ల ఎంపికలతో వచ్చింది. 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్ నుంచి 88 హెచ్ పీ, 113 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 98 హెచ్ పీ, 147 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ 20 నుంచి 23 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. 190 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు రూ.7.51 లక్షల నుంచి రూ.9.38 లక్షల మధ్య అందుబాటులో ఉంది.

సిట్రోయన్ సీ3 కారు రెండు రకాల ఇంజిన్లతో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నుంచి 80 హెచ్ పీ, 115 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. అలాగే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 108 హెచ్ పీ, 205 ఎన్ ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు దాని వేరియంట్ల ప్రకారం 18 నుంచి 19 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తుంది. సిట్రోయన్ సీ3 ప్రారంభ ధర రూ.6.16 లక్షలు, టాప్ స్పెక్ ట్రిమ్ కోసం రూ.10.26 లక్షలు ఖర్చు పెట్టాలి.

మహీంద్రా 3ఎక్స్ వో కారు ప్రారంభ ధర రూ.7.79 లక్షలు. దీనిలో టాప్ ట్రిమ్ రూ.15.49 లక్షల వరకూ ఉంటుంది. దీనిలో మూడు రకాల ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నుంచి 118 హెచ్ పీ, 200 ఎన్ ఎం టార్క్ వెలువడుతుంది. అలాగే 1.2 లీటర్ టీజీడీఐ ఇంజిన్ నుంచి 128 హెచ్ పీ, 230 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 115 హెచ్ పీ, 300 ఎన్ ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఈ వాహనం గ్రౌండ్ క్లియరెన్స్ 201 ఎంఎంగా ఉంది. పెట్రోలు వేరియంట్ 18 నుంచి 20 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి.

హ్యుందాయ్ విడుదల చేసిన వెన్యూ ఎన్ లైన్ కారు కూడా పర్వతాలు, కొండలపైకి వెళ్లే రోడ్లపై సునాయాసంగా దూసుకుపోతుంది. ఈ కారు బ్రేస్ ట్రిమ్ రూ.12.07 లక్షలు, టాప్ ట్రిమ్ రూ.13.89 లక్షల ధరకు అందుబాటులో ఉంది. దీనిలోని 1.0 లీటర్ టర్బో పెట్రోలు ఇంజిన్ నుంచి 87 హెచ్ పీ, 172 ఎన్ ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 195 ఎంఎం. ఈ కారు దాదాపు 18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.