
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల ఉచిత సర్వీసుల గడువును జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్వాహన వినియోగదారులకు వారెంటీ, ఉచిత సర్వీస్ గడువును జూన్ చివరి వరకు పొడగిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

వారంటీ, ఉచిత సర్వీస్ గడువు 2021 ఏప్రిల్ 1 నుండి మే 31 మధ్య ముగిసే కస్టమర్లకు మరో నెల రోజుల అంటే జూన్ 30 వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కరోనా వల్ల కస్టమర్లు సకాలంలో వాహన సర్వీసులు పొందలేకపోతున్నారని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Tata Motors