SBI Offer: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. గృహోపకరణల వస్తువులపై తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ వంటి తదితర ప్రొడక్టులపై తగ్గింపు అందిస్తోంది
ఎస్‌బీఐ కార్డు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రూ.1000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ వరకు పొందే అవకాశం ఉంది. ఆఫర్ పొందాలని భావించే వారు క్రోమా స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదంటే క్రోమా వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోళ్లు చేయవచ్చు.
ఒక విషయం ఏంటంటే.. కొనుగోలుదారులు తప్పకుండా బిల్లు మొత్తాన్ని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించాలి. ఈ ఆఫర్ జూన్ 27 వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. ఈ ఆఫర్ పొందాలంటే కనీసం రూ.20 వేల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.