Union Budget: బడ్జెట్ వేళ దేశ ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న వీటి ధరలు..

Updated on: Jan 26, 2026 | 7:42 PM

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేనట్లు కుప్పకూలిపోతుంది. దీంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. బంగారంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు ఏయే ధరలు పెరుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 92 రూపాయల కనిష్ట స్థాయికి కుప్పకూలింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలతో పాటు విదేశీ విద్య, విదేశీ ప్రయాణం మరింత ఖరీదు కానుంది. డాలర్ బలపడటం, విదేశీ నిధుల తరలింపు కొనసాగడం వల్ల రూపీ విలువ పడిపోతుంది.

2 / 5
ఈ నెలలో ఇప్పటివరకు రూపీ విలువ 222 పైసలు తగ్గింది. 2 శాతానికి పైగా తగ్గి జీవితకాలపు కనిష్ట స్థాయిని నమోదు చేసింది. దీంతో దిగుమతులపై దీని ప్రభావం తీవ్రంగా పడనుంది. వస్తువులు దిగుమతి చేసుకునే సమయంలో ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి వస్తువులకు చెల్లించడానికి యూఎస్ డాలర్లను కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చువుతాయి.

3 / 5
ఈ క్రమంలో భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే ముడి చమురు, బొగ్గు, ప్లాస్టిక్, రసాయనాలు, ఎలక్ట్రానిక్, ఎరువులు, బంగారం, యంత్రాలు, కూరగాయల నూనె, ఇనుము, ఉక్కు వంటి ధరలు పెరగనున్నాయి. ఇక మొబైల్ ఫోన్ విడిభాగాలు, కార్లు, ఇంట్లోకి ఉపయోగించే వస్తువుల ధరలు పెరగనున్నాయి.

4 / 5
ఇక విదేశీ విద్యార్థులపై భారం పడనుంది. విద్యార్థులు ఫీజులు చెల్లించేటప్పుడు డాలర్‌కు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక విదేశీ పర్యటనలకు వెళ్లేవారికి కూడా ప్రయాణ ఖర్చులు పెరగనున్నాయి. ఇక ప్రవాస భారతీయులు డబ్బులు పంపడానికి ఎక్కువ మొత్తాన్ని రూపాయలలో పంపాల్సి ఉంటుంది.

5 / 5
ఇక వస్తువులు ఎగుమతులు చేసేవారికి మాత్రం లాభం జరగనుంది. వాళ్లు యూఎస్ డాలర్‌కు ఎక్కువ రూపాయలు పొందుతారు. దీని వల్ల ఎగుమతిదారులకు ప్రయోజనం జరగనుందని నిపుణులు చెబుతున్నారు.